Abn logo
Oct 15 2021 @ 00:03AM

టీయూ వీసీ, రిజిస్ర్టార్‌పై ఎమ్మెల్సీ ఆగ్రహం

టీయూ వీసీతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవితనిజామాబాద్‌, అక్టోబరు 14, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల నియామకాలపై ఎమ్మెల్సీ కవిత ఆరాతీశారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడంలేదని వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ర్టార్‌ కనకయ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీయూ వీసీ, రిజిస్ర్టార్‌ గురువారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివా సంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులపైన ధర్నాలు జరగడం, ఫిర్యాదులు చేస్తు న్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ నిలదీశారు. విశ్వవిద్యాలయంలో జరిగిన పరిస్థితులపై వెంట వెంటనే ఎందుకు స్పందించడంలేదన్నారు. ఏవైనా నిబంధనలకు వి రుద్ధంగా జరిగితే సీరియస్‌ పరిణామాలు ఉంటాయని హె చ్చరించారు. విశ్వవిద్యాలయంలో నెల రోజులకుపైగా ఖాళీలపైన విద్యార్థి సంఘాలతో పాటు ఇతరులు ఫిర్యాదులు చేస్తే ఎందుకు స్పందించడంలేదని వారిని అడిగారు. వీసీ గా నిర్ణయాలను తీసుకుంటే వెంటనే అందరికీ అర్థ మయ్యే రీతిగా ఎందుకు చెప్పలేదని అడిగారు. ని బంధనలకు విరుద్ధంగా పోస్టుల భర్తీ చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలిపారు. ఏవై నా తప్పిదాలు జరిగితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని వారికి తెలిపారు. ఎమ్మెల్సీ కవి త ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కొత్తగా నియమించిన పోస్టులను రద్దుచేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధి కారులు ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు లేకుండా ఎవరినీ నియమించవద్దని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో నెలరోజుల్లో సుమారు 105 పోస్టుల వరకు భర్తీ చేశారు. కాగా టీయూకు మంజూరైన రూసా నిధులు రూ.10 కోట్లతో భవనాల నిర్మా ణానికి ఈ నెల 29, 30 తేదీ ల్లో శంకుస్థాపనకు ఏర్పాటు చేస్తున్నామని వీసీ, రిజి స్ట్రార్‌లు ఎమ్మెల్సీ కవిత కు వివరించారు.