Abn logo
Jun 4 2020 @ 03:24AM

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు

ఎమ్మెల్యే విడదల రజిని


చిలకలూరిపేట, జూన్‌ 3 : సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. పలువురు దాతలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చిన నగదు చెక్కులను ఎమ్మెల్యేరజిని బుధవారం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌కు అందజేశారు. కరోనా ఆపద సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు చాలామంది ముందుకు వచ్చి తోచిన ఆర్థికసాయం చేస్తుండటం అభినందనీయమని ఎమ్మెల్యే రజని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement