Abn logo
Oct 14 2021 @ 00:39AM

శివాలయంలో ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక పూజలు

శివాలయంలో పట్టువసా్త్రలు అందజేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు, అక్టోబరు 13: పాతగుంటూరులోని అగస్తేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీగంగా పార్వతీ అమ్మవారికి శాసో్త్రక్తంగా పట్టువసా్త్రలను అందించి విశేష పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతోఉండాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, ఆలయ కమిటీ అధ్యక్షుడు కీసరి ఆదినారాయణరెడ్డి, కార్పొరేటర్‌ యిర్రి ధనలక్ష్మీ, వెంకటేశ్వరరావు, సుబ్బులు, ఈవో సౌమ్య తదితరులున్నారు.