Abn logo
Jun 4 2020 @ 04:00AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

బలిజిపేట, జూన్‌ 3: ప్రజలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు అన్నారు. బుధవారం అజ్జాడలో సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 40 లక్షల రూపాయలతో సచివాలయాన్ని నిర్మించి ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అవసరమైన అన్ని పనులు జరిగేలా సచివాలయ వ్యవస్థ పనిచేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కారమయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయంతోపాటు రైతు భరోసా, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టి ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత దగ్గర చేస్తున్నామన్నారు. నాడు-నేడులో ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్‌కు ధీటుగా తయారుకానున్నట్టు తెలిపారు.


అనంతరం రాయితీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు అంద జేశారు. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్‌ పాలవలస మురళీకృష్ణ, అజ్జాడ మాజీ సర్పంచ్‌ అక్కేన ఎల్లంనా యుడు, వైసీపీ నాయకులు వెలిది సాయిరాం, ఎస్‌.వాసుదేవరావు, డి.కృష్ణ, పోల రామకృష్ణ, ఎంపీడీవో కే.ఎస్తేర్‌రాణి, ఈవోఆర్‌డీ దేవకుమార్‌, వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. 


అర్హులందరికీ పింఛన్‌లు..

పార్వతీపురంటౌన్‌: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పింఛన్లను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేర కు అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయనున్నామన్నారు. పట్టణంలోని 30 వార్డుల్లో అర్హులైన నిరుపేద వృద్ధ, వితంతు, వికలాంగులు ప్రతి నెలా 5వ తేదీ నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెలా ఒకటో తేదీ నుంచి పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ

సీతానగరం: మండలంలోని పెదంకలాం ఆరోగ్య కేంద్రం పరిధిలో భూర్జ గ్రామంలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులను ఎమ్మెల్యే అలజంగి జోగారావు పంపి ణీ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలో 1900 ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చాయన్నారు. ఎంపీడీవో జి.పార్వతమ్మ, డాక్టర్‌ నీలిమాప్రసూజ, ఆయూష్‌ వైద్యాధికారిణి హేమాక్షి, ఈవో సూర్యనారాయణ, వైసీపీ నాయ కులు వి.నాగేశ్వరరావు, టీవీ అప్పలనాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement