Advertisement
Advertisement
Abn logo
Advertisement

కిషన్‌రెడ్డి పేరులో కిసాన్ ఉంది.. కానీ ఆయన కిసాన్‌లకు వ్యతిరేకం: జీవన్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేరులో కిసాన్ ఉంది కానీ.. ఆయన కిసాన్‌లకు వ్యతిరేకమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక టూరిస్టుగా మారారన్నారు. కేంద్రమంత్రిగా ఉండి ఆయన ఒక్క రూపాయి తెస్తే ఒట్టన్నారు. ఒక్క గింజా కొనం అని పీయూష్ గోయల్ అంటే- ప్రతీ గింజా కొంటాం అని కిషన్ రెడ్డి అంటున్నారన్నారు. ఎంపీ అరవింద్ మాట్లాడే మాటలకు నిరసనగా గాంధీ హాస్పిటల్‌లో ఆయన మూతికి కుట్లు వెయ్యాలన్నారు.


ఆర్ఆర్ఆర్ (RRR) అంటే.. రెచ్చగొట్టడం, రచ్చచేయడం, రద్దు చేయడం అని జీవన్ రెడ్డి వివరించారు. రూ. 10, 15 వేల కోట్లు కేంద్రానివి కాదంటే ఒడ్లు కొనవచ్చునని, రూ. 15 వేల కోట్లు తెస్తే కిషన్ రెడ్డికి ప్రగతిభవన్‌లో సన్మానం చేస్తామన్నారు. రైతులు పంట మార్పిడి చేసుకోవాలన్నారు. వరి పంట కొనమని స్పష్టం చేశారు. రైతులు ఏ పంటలు వేయాలనేది త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారులు చెబుతారని జీవన్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement