Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంత భయభ్రాంతులకు గరిచేసినా పాదయాత్ర ఆగదు: Gottpati

ప్రకాశం: ప్రభుత్వం ఎంత భయభ్రాంతులకు గురిచేసినా రాజధాని కోసం రైతులు చేపట్టి మహా పాదయాత్ర  ఆగదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఇది రైతు ప్రజా పాదయాత్ర అని అన్నారు. రాజధానిని చంపేద్దామని పాదయాత్రను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి కక్ష సాధింపు ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు. ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement