Abn logo
Sep 17 2021 @ 00:08AM

ర్యాంకర్‌కు ఎమ్మెల్యే గొట్టిపాటి అభినందన

లింగా వర్ధన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

అద్దంకి, సెప్టెంబరు16: ఉత్తమ ప్రతిభ కనబరిచి ఏపీఈఏపీ సెట్‌ (మెడికల్‌)లో రాష్ట్ర స్థా యిలో 89 వ ర్యాంక్‌ సాధించి ధేనువకొండకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావటం అభినందనీయమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అ న్నారు. ధేనువకొండలో మెడికల్‌లో 89వ ర్యాంక్‌ సాధించిన లింగా వర్దన్‌ను గురువారం రవికుమార్‌  అభినందించారు.  అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్మోహనరెడ్డి  బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ను రద్దు చేయటం ఎంతవరకు  సమంజసం అన్నా రు. ఫలితంగా గిరిజన, ఎస్సీ,ఎస్టీ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ లో చదివిన ఎంతోమంది గి రిజన విద్యార్థులు డాక్టర్‌లు, ఇంజనీర్‌లుగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు. అమ్మఒడి పథకం ఇ చ్చామన్న సాకుతో బీఎఎ్‌స పథకం  రద్దు చేయటం తగదన్నారు.