Abn logo
Sep 27 2020 @ 00:55AM

ఐలమ్మ తెగువే మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి

Kaakateeya

ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, మహేశ్‌రెడ్డి

పలుచోట్ల ఐలమ్మ జయంతి వేడుకలు


వికారాబాద్‌/తాండూరు/పరిగి(రూరల్‌)/కులకచర్ల: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ సాయుధపోరులో చూపిన తెగువే మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను జిల్లాలో పలుచోట్ల జరుపుకున్నారు.   వికారాబాద్‌లో ఏర్పాటుచేసిన ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే ఆనంద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిజాం పాలన, విసునూరు దేశ్‌ముఖ్‌కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ పోరాట పటిమను, ధైర్యసాహసాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, చిగుళ్లపల్లి రమేష్‌, అనంత్‌రెడ్డి, లక్ష్మణ్‌, మల్లికార్జున్‌, దత్తు, అఫ్జల్‌ షకీల్‌, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.


తాండూరు పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని నిర్వహించా రు. ఆమె ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, కౌన్సిలర్లు రామకృష్ణ, శోభారాణి, ముఖ్తార్‌నాజ్‌, నాయిబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు దౌలయ్య, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు రాజన్‌గౌడ్‌, నాయకులు సయ్యద్‌షుకూర్‌ పాల్గొన్నారు. జైభీం, జనచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో సం ఘం సభ్యులు జుంటుపల్లి వెంకటేష్‌, చాకలి విక్రాంత్‌, పరమేష్‌, నీరటి రవి తదితరులు ఐలమ్మకు నివాళులర్పించారు. పరిగి పట్టణలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి పాల్గొని ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన సేవలను కొనియాడారు.


ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందా అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ  చైర్మన్‌ ఎస్పీ బాబయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్‌ రాజేందర్‌, రజక సంఘం నాయకులు రాములు, శేఖర్‌, నర్సిములు, ఆంజనేయులు పాల్గొన్నారు. కులకచర్లలో నీలకంఠ రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మా లలు వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, సంఘం నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, బుచ్చయ్య, సత్తెమ్మ, విజయమ్మ, బచ్చమ్మ, చందన, శ్రావణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement