Abn logo
Sep 22 2020 @ 03:23AM

చినజీయర్‌కు ఎమ్మెల్యే ఏలూరి పరామర్శ

Kaakateeya

పర్చూరు, సెప్టెంబరు 21 : ప్రముఖ ఆథ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామిని శాసన సభ్యులు ఏలూరి సాం బశివరావు పరామర్శించారు. సోమవారం శంషాబాద్‌ సమీపంలో ముచ్చింలోని చినజియర్‌ స్వామి ఆశ్రమానికి మా జీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి వెళ్లారు.


ఇటీవల చినజియర్‌స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు గుండెపోటుతో మరణించిన నేపఽథ్యంలో ఆయన్ని పరామర్శించారు. ఏలూరితోపాటు కొత్తగూడెంకు చెందిన రాజకీయనేత కోనేరు సత్యనారాయణ, పర్చూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు బండారుపల్లి రామచంద్రంబాబు ఉన్నారు. 


Advertisement
Advertisement
Advertisement