Abn logo

కూర పొడి (మిక్స్‌డ్‌ పల్స్‌)

కావలసినవి: ఎండుమిర్చి - ఐదు, జీలకర్ర - ఒక స్పూన్‌, ఇంగువ - చిటికెడు, మిరియాలు - రెండు, లవంగం - ఒకటి, ఎండుకొబ్బరి - రెండు స్పూన్లు, శనగపప్పు - ఒక కప్పు, మినప్పప్పు - అర కప్పు, నువ్వుపప్పు - అర కప్పు, నూనె - ఒక స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పల్లీలు - అరకప్పు, ధనియాలు - ఒక స్పూన్‌, జీడిపప్పు - ఐదారు పలుకులు. 


తయారీ విధానం: స్టవ్‌ మీద బాణలి పెట్టి ఒక స్పూన్‌ నూనె వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగం వేసి వేగించాలి. తరువాత నువ్వుపప్పు, జీడిపప్పు వేసి వేగించాలి. పప్పు దినుసులు కూడా వేసి వేగించాలి. ఇప్పుడు  అన్నీ కలిసేలా కలిపి తగినంత ఉప్పు వేసి, ఎండు కొబ్బరి కలపాలి. ఈ పొడి గుత్తి వంకాయ, సొరకాయ, బీర, బెండకాయ కూరల్లో వాడొచ్చు. ఈ పొడి వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది.

స్టఫ్డ్‌ టొమాటోమజ్జిగ చారుమెలన్‌ కివీ స్మూతీపుదీనా పోహాఢోక్లాదిబ్బరొట్టెటొమాటో కాధా మసాలా షోర్బాఇండియన్‌ సలాడ్‌క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌స్టఫ్ఫ్‌డ్‌ క్యాప్సికమ్‌ కర్రీ
Advertisement