Abn logo
Oct 25 2020 @ 01:11AM

ఆరోగ్యమిత్రలు, టీమ్‌ లీడర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 24: ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్న జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్రలు, టీమ్‌ లీడర్ల నియామకానికి అర్హులైన వారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు శనివారం తెలిపారు. ఆరోగ్య మిత్రల పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్‌టీ అర్హత ఉండాలన్నారు. టీమ్‌ లీడర్‌ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్‌టీ అర్హతతో పాటు రెండేళ్లు ఆస్పత్రిలో పనిచేసిన అనుభవం, అదనంగా ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 నుంచి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ నెల 31లోగా అందజేయాలని సూచించారు.


Advertisement
Advertisement