Abn logo
Jul 7 2020 @ 10:42AM

రీగల్‌ టాకీస్‌లో ‘మిరుణా’ విడుదల

అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీలకు ధీటుగా ప్రముఖ తమిళ సినీ నిర్మాత సీవీ కుమార్‌ ‘రీగల్‌ టాకీస్‌’ పేరుతో రూపొందించిన ఓటీటీలో బుధవారం ‘మిరుణా’ అనే తమిళ చిత్రం విడుదల కానుంది. నిర్మాత రాఘవ్‌ మిర్దాద్‌ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అరుణ్‌కుమార్‌, శరణ్యా తురాడి, వెట్రి, ఆదిరా, అనుపమా కుమార్‌, కేరవాన్‌ అరుణాచలం, కోదై నటించారు. ప్రిన్స్‌ ముల్లా దర్శకత్వం వహించారు. సూర్యోదయం వేళ జాగింగ్‌కు వెళ్ళిన హీరో ఎదుట అందమైన యువతి ప్రత్యక్షమవుతుంది. వారి చూపులు కలవడంతో హీరో మధురానుభూతికి గురవుతాడు. ఆమె తోడిదే లోకమని భావిస్తాడు. తరచూ హీరో జీవితంలో ఆ యువతి తళుక్కన మెరసి అదృశ్యమవుతుంటుంది. ఆ యువతి ఆచూకీ కనుక్కోలేక హీరో పిచ్చివాడిలా సంచరిస్తాడు. స్నేహితుడు అతడికి పిచ్చిపట్టిందని సైక్రియాటిస్ట్‌ వద్దకు తీసుకెళ్ళి చికిత్స చేయిస్తాడు. ఆ తర్వాత కథ వింత మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రం ఈనెల 8న రాత్రి ఎనిమిది గంటలకు రీగల్‌టాకీస్‌లో ప్రసారమవుతుందని నిర్మాత రాఘవ్‌ మిర్దాద్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement