Abn logo
Aug 3 2021 @ 15:41PM

17 ఏళ్ల ఆ పిల్లాడిపై అత్యాచారం కేసు పెట్టిన 35 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..

ఆ మహిళ వయసు 35 ఏళ్లు.. సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె ఓ బాలుడిపై అత్యాచారం కేసు పెట్టింది.. 17 ఏళ్ల కుర్రాడు తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.. పెళ్లి పేరు చెప్పి తనను మోసం చేశాడని పేర్కొంది.. తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని తెలిపింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


సోమవారం జాష్పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళ 17 ఏళ్ల బాలుడిపై అత్యాచారం కేసు పెట్టింది. తనకు ఆ బాలుడితో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి శారీరకంగా కూడా దగ్గరయ్యానని ఆమె చెప్పింది. అలాగే తన నుంచి చాలా సార్లు డబ్బులు కూడా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 


పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడం మొదలుపెట్టిన తర్వాత సదరు బాలుడు తనకు కనిపించడం మానేశాడని, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని బాధిత మహిళ తెలిపింది. అలాగే తన నుంచి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని చెప్పింది. ఆమె చెప్పింది విని కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని బాలల వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. 

ప్రత్యేకంమరిన్ని...