Abn logo
May 21 2020 @ 13:38PM

ఇక‌పై విమానాల్లో ప్ర‌యాణించాలంటే.. ఇవి త‌ప్ప‌క పాటించాల్సిందే...

న్యూఢిల్లీ: క‌రోనా సంక్షోభం వ‌ల్ల విమాన‌ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించిన భార‌త ప్ర‌భుత్వం... ఈ నెల 25 నుంచి దేశీయ విమాన స‌ర్వీసుల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా పౌర విమాన‌యాన మంత్రిత్వ‌ శాఖ ప్ర‌యాణికులు పాటించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. విమాన‌యాన మంత్రిత్వ‌ శాఖ విడుద‌ల చేసిన నిబంధ‌న‌లు ఒక‌సారి ప‌రిశీలిస్తే....

1. సామాజిక దూరం: వీలైనంత వ‌ర‌కు ఒక‌రిని ఒక‌రు తాక‌క‌పోవ‌డం

2. సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం

3. డిజిట‌ల్ పేమెంట్ చేయ‌డం‌, గుర్తింపు పొందిన సంస్థ‌కు చెందిన టాక్సీల్లో మాత్ర‌మే ప్ర‌యాణించ‌డం

4. బ్యాగేజీ: కేవ‌లం ఒక చెక్ ఇన్ బ్యాగ్‌, ఒక క్యాబిన్ బ్యాగ్‌కు మాత్ర‌మే అనుమ‌తి 

5. వృద్ధులు, గ‌ర్భిణిలు, అనారోగ్య స‌మ‌స్య‌లు గ‌ల వారు విమాన ప్ర‌యాణాల‌కు దూరంగా ఉండాలి

6. వెబ్ చెక్ ఇన్ ద్వారా బోర్డింగ్ పాస్ తీసుకోవాలి

7. బ్యాగేజీ ట్యాగ్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి క‌నిపించే విధంగా బ్యాగులపై అతికించాలి

8. ఒక‌వేళ ప్రింట్ తీసుకునే వీలు లేక‌పోతే పీఎన్ఆర్ నెంబ‌ర్‌, ప్ర‌యాణికుడు/ ప్ర‌యాణికురాలి పేరు ఒక కాగితంపై రాసి బ్యాగేజీకి ట్యాగ్ చేయాలి. 

9. విమానాశ్ర‌యంలో ప్ర‌వేశించ‌డానికి ముందే ముఖానికి మాస్కులు త‌ప్ప‌నిస‌రి

10. రెండు గంట‌ల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి

11. ఆరోగ్య సేతు యాప్ లేదా సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఫార్మ్ ద్వారా ప్ర‌యాణికులు త‌మ ఆరోగ్య స్థితిని ధృవీకరించాల్సి ఉంటుంది

12. కంటైన్‌మెంట్ జోన్‌కు చెందిన వారు ప్ర‌యాణించ‌డానికి వీలులేదు

13. క‌రోనా పాజిటివ్ ఉన్న‌వారు కూడా ప్ర‌యాణించ‌కూడ‌దు   


Advertisement
Advertisement
Advertisement