Abn logo
Sep 21 2020 @ 19:09PM

శారదా పీఠానికి నూతన రథ నమూనా

Kaakateeya

విశాఖ : శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామితో మంత్రులు వెల్లంపల్లి, శ్రీరంగనాథ రాజు భేటీ అయ్యారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, దేవాదాయ కమిషనర్ అర్జున రావు కూడా ఈ బృందంలో ఉన్నారు. అంతర్వేది నూతన రథ నమూనాను స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రకు మంత్రులు చూపించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. గతాని కన్నా శ్రేష్ఠంగా రథాన్ని తయారు చేయాలని సూచించారు. 



రథ నిర్మాణానికి ఉత్కృష్టమైన కలపను వినియోగించాలని, దహన అరిష్టానికి ఆయా దేవస్థానాల్లో ప్రాయశ్చిత్త హోమాలు కూడా నిర్వహించి తీరాలని స్వరూపానందేంద్ర మంత్రుల బృందానికి సూచించారు. అన్యాక్రాంతమైన అంతర్వేది దేవస్థానం భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ దృష్టి సారించాలని, సంప్రదాయాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఆరు ఆగమాలకు చెందిన ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయాలని స్వరూపానందేంద్ర స్వామీజీ సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement