Abn logo
Oct 24 2020 @ 04:56AM

తాగునీటి సమస్య రాకుండా చూడాలి

Kaakateeya

మంత్రి సబితాఇంద్రారెడ్డి 

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్ష 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో  తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీనగర్‌కాలనీలోని మంత్రి నివాసంలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎల్లూరు దగ్గర  మిషన్‌భగీరథ  పంప్‌హౌస్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో నిలిచిన నీటి సరఫరాను పునరుద్ధ్దరించే వరకూ ప్రత్యామ్నాయ చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో 133 గ్రామాలు,  ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ మునిసి పాలిటీలకు గున్‌గల్‌, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు, కందుకూరు మండలంలోని గ్రామా లకు గున్‌గల్‌ నుంచి నీటిసరఫరా చేయాలన్నారు. శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లోని  40 గ్రామాలకు  పాత మంజీరా ద్వారా నీటి సరఫరాను రెండు రోజుల్లో ప్రారంభించాలని  అధి కారులను  మంత్రి ఆదేశించారు. 


వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, తాండూరు మున్సిపాలిటీ లకు కాగ్నానది ద్వారా, వికారాబాద్‌ మున్సిపాలిటీకి శివసాగర్‌ ప్రాజెక్ట్‌ద్వారా నీటిసరఫరా చేపట్టాలని సూచించారు. అదే విధంగా కొడంగల్‌ నియోజక వర్గంలోని 216 గ్రామాలకు కాగ్నా ద్వారా నీటి సరఫరాకు ట్రయల్‌ రన్‌ పూర్తి అయిందని రెండు రోజుల్లో నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. 


ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని 1,064 గ్రామాలు, వికారాబాద్‌ జిల్లాలోని 956 గ్రామాల సర్పంచ్‌లకు కృష్ణానీటి పునరుద్ధ్దరణ జరిగే వరకు గ్రామాల్లోని స్కీమ్‌ బోర్లను, సింగిల్‌ఫేస్‌ బోర్లను వాడుకోవాలని సూచించారు. బోరుమోటార్లు, బోర్ల మరమ్మ తులు చేయించుకోవాలన్నారు. తీవ్ర నీటిఎద్దడి ఉన్న చోట్ల ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. పంచా యతీలపై భారం పడకుండా మిషన్‌భగీరథ నిధులు ఖర్చు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ ఆంజనేయులు, ఈఈరాజేశ్వర్‌, నర్సింహులుగౌడ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement