Abn logo
May 23 2020 @ 13:26PM

సకాలంలో పన్నులు చెల్లించకపోతే....: మంత్రి పేర్నినాని

విశాఖపట్నం: సకాలంలో పన్నులు చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పేర్నినాని అన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండపోవడం వల్లే విద్యుత్ మీటర్లు ఎక్కువగా తిరిగి, బిల్లులు కూడా ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలోని పలు కాలనీలల్లో మంత్రి పేర్ని నాని పర్యటించారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక కష్టాలు పడుతున్న వారంతా ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలర్ టీవీ ఆన్‌చేసి ఉంచితే బిల్లు ఎక్కువగా వచ్చిందని, విద్యుత్ చార్జీల భారంపై మంత్రి పేర్నినాని వినూత్న వివరణ ఇచ్చారు. 


Advertisement
Advertisement
Advertisement