Abn logo
Jun 4 2020 @ 03:10AM

ఆలయ భూముల ఆదాయాన్ని పెంచాలి

మచిలీపట్నం టౌన్‌ : దేవాలయ భూములపై ఆదాయం సక్రమంగా వచ్చేలా అధికారులు జాగ్రత్త వహిం చాలని దేవదాయ ధర్మాదాయ శాఖ అధికా రులను  మంత్రి పేర్ని  నాని ఆదేశించారు.   ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఎండోమెంట్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, ఈవోలు నటరాజ షణ్ముగం, టి.వి.వి. మోహనరావు, సత్యప్రసాద్‌, ఏజె కళాశాల కరస్పాండెంట్‌ గుంటూరు సీతారావమ్మ, ఆంజనేయ స్వామి, జోగి రాంబాబు, రామప్రసాద్‌, బీరం మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పట్టణంలో పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. 

Advertisement
Advertisement
Advertisement