Abn logo
Jul 9 2020 @ 05:33AM

మార్కెట్ల స్వరూపం మారుస్తాం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


కల్వకుర్తి అర్బన్‌, జూలై 8: రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల రూపురేఖలను మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మార్కెట్‌ కార్యాలయాలను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్‌ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌  పద్మావతితో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. పంజుగులలో  రైతువేదిక భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.  కల్వకుర్తిలోని వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన కా ర్యక్రమంలో మంత్రి మాట్లాడారు.  పట్టణంలోని సద్గురు పారా బాయిల్డ్‌ రైస్‌మిల్లు ఆవరణలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ మొక్కలు నా టారు.  జడ్పీ వైస్‌చైర్మన్‌ ఠాగూర్‌ బాలా జీసింగ్‌,  గోలీ శ్రీనివాస్‌రెడ్డి,  హ నుమంత్‌రెడ్డి, సునీత కుర్మయ్య,  గోవర్ధన్‌, బాలయ్య  పాల్గొన్నారు.

Advertisement
Advertisement