Abn logo
Oct 11 2020 @ 05:40AM

దైవచింతనతో ప్రశాంతత

మంత్రి మల్లారెడ్డి 


ఘట్‌కేసర్‌ రూరల్‌: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండలంలోని అవుశాపూర్‌లోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర సురమాంభదేవి కల్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు  స్వామివారికి అర్చన చేసి మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి, అమ్మవార్లకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, జలాభిషేకం కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు.


అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలన్నారు. హోమం కార్యక్రమంలో శ్రీనివా్‌సగౌడ్‌, రవీందర్‌గౌడ్‌, బిక్షపతిగౌడ్‌, నవీన్‌, మధుసుధన్‌, పెంటే్‌షగౌడ్‌, పరశురాములుగౌడ్‌ దంపతులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ అయిలయ్యయాదవ్‌, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కొండల్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ శంకర్‌గౌడ్‌, మాజీసర్పంచ్‌  బిక్షపతిగౌడ్‌, పంచాయతీసభ్యులు వీరేశం, మల్లేష్‌, మాజీ ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి, మశ్చేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement