Abn logo
Oct 11 2020 @ 05:40AM

టీఆర్‌ఎస్‌తోనే శరవేగంగా అభివృద్ధి

రూ.కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి 


మేడ్చల్‌:  టీఆర్‌ఎస్‌ పాలనలోనే మున్సిపాలిటీల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటితో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ, సీసీరోడ్లు, పైపులైన్‌ పనులతో పాటు మున్సిపాలిటీకి చెందిన నూతన వాటార్‌ ట్యాంకర్‌లను, శ్మశానవాటికను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మేడ్చల్‌ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు.


కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడినప్పటి నుంచి ప్రతీ మున్సిపాలిటీలో ఎంతో అభివృదిఽ్ధ జరుగుతోందన్నారు. అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, శైలేందర్‌, కౌన్సిలర్‌లు హరికృష్ణ, దేవ, మాధవి, గణేష్‌, మహేష్‌, ఉమానాగరాజు, ఏఎస్సార్‌, సాయికుమార్‌, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement