Abn logo
Sep 27 2020 @ 02:45AM

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

Kaakateeya

అవసరమైతే కేబినెట్‌లో నిర్ణయం

ఇందుకోసం డబ్బులు వసూలు చేయబోం

పారదర్శకంగా ‘ఆస్తుల నమోదు’ చేపడతాం

హైదరాబాద్‌ ప్రజలకు మంత్రి కేటీఆర్‌ భరోసా

ఎమ్మెల్యేలు, కాలనీ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్‌


హైదరాబాద్‌/హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ఆస్తులపై హక్కులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పే ర్కొన్నారు. ఇందుకోసం ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేసే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చే శారు. భవిష్యత్తులో ఆస్తుల క్రయ, విక్రయాల్లో ఇబ్బందుల్లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీ కమిటీలు, బస్తీ సంఘాల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాద వ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మునిసిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లో భూ ములసమస్యలు దాదాపుగా తొలగిపోయాయని చెప్పా రు. ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 24.50 లక్షలఆస్తులు ఉన్నట్లు అంచనాలున్నాయన్నారు. వీటిల్లో పలు కారణాల రీత్యా ఆస్తుల హక్కులపై సమస్యలున్నాయని చెప్పారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించి, యజమానులకు వాటిపై హక్కు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవసరమైతే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.  


సమస్యల పరిష్కారం దిశగా..

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పలు బస్తీలు, కాలనీల్లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూవివాదాల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బస్తీ, కాలనీ సంఘాల ప్రతినిధులతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ నేరుగా మాట్లాడారు. వాస్తవానికి 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల స మయంలోనే పలు డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో రెవె న్యూ, దేవాదాయ, వక్ఫ్‌, పరిశ్రమలు తదితర విభాగాలతో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూ ముల సమస్యలు పరిష్కరిస్తామని అధికార టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. కానీ, ఆ తర్వాత జీవో నంబర్‌ 58, 59తో ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భూ వివాదాలకు పరిష్కారం లభించలేదు. అసైన్డ్‌, యూఎల్‌సీ భూముల్లో వెలిసిన బస్తీలు, కాలనీల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి సైతం యాజమాన్య హక్కులు లేవు. టైటిల్‌ లేకపోవడంతో ఆ స్థలా ల్లో ఇళ్లనిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వడం లేదు.


ఇంతకు ముందు ఉన్న నివాసాలకు ఇంటి నంబ ర్లు కేటాయించకుండా... కొన్ని బస్తీల్లో 100 శాతం పెనాల్టీతో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. మరోవైపు రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌ ద్వారా క్రయ, విక్రయాలకు అవకా శం లేకుండా పోయింది. ఇలాంటి వివాదాలున్న భూ ములకు పరిష్కారం చూపేలా ప్రస్తుతం కసరత్తు మొ దలు పెట్టారు. కార్వాన్‌లోని శివబాగ్‌, గాయత్రినగర్‌, మహే్‌షనగర్‌, బాలాజీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లకు యజమాన్యపు హక్కు లేదని, సనత్‌నగర్‌ మోండా మార్కెట్‌, ఆదయ్యనగర్‌ ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌ను ఫ్రీ హోల్డ్‌ చేయాలని, జీరాలో ఉన్న 134 గృహాలను రెగ్యులరైజ్‌ చేయాలని స్థానికులు కోరారు. నల్లగుట్ట, బన్సీలాల్‌పేట తదితర ప్రాంతాల్లోని స్థలాలను జీవో నం బర్‌ 58 ప్రకారం క్రమబద్ధీకరించాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందుకోసం మరో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఓ ఎమ్మెల్యే తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement