Abn logo
Nov 25 2021 @ 14:04PM

Jr NTRకు మాకు సంబంధం ఏంటి: Kodali Nani షాకింగ్ కామెంట్స్

అమరావతి: జూనియర్ ఎన్టీఆర్‌కు తమకు సంబంధం ఏమిటి? అని మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘ఒకప్పుడు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం? ఇప్పుడు నేను, వంశీ జగన్‌తో ఉన్నాం. ఆయన కోసం పని చేస్తున్నాం’’ అని కొడాలి నాని వెల్లడించారు.


ఎన్టీఆర్ కుటుంబం మద్దతు కోసం చంద్రబాబు ఆయన భార్యను రోడ్డు మీదకు లాగారని కొడాలి అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతూనే ఉందని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబం మాటలు చూస్తే తనకు జాలేసిందని కొడాలి ఎద్దేవా చేశారు. జగన్‌ను వేధించిన సోనియా నుంచి ఎర్రన్నాయుడు, శంకర్రావు, లోకేష్ పరిస్థితి ఏంటో అందరూ చూశారని చెప్పారు. చంద్రబాబుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి ప్రశ్నించారు.