Abn logo
Oct 24 2020 @ 14:45PM

నిమ్మగడ్డపై మరోసారి మంత్రి నాని సంచలన వ్యాఖ్యలు

Kaakateeya

కృష్ణా : కరోనా కల్లోలంతో మార్చిలో ఆగిపోయిన స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలవుతుందా? అయితే... దానిని ఆగిన చోటి నుంచే కొనసాగిస్తారా? లేక...  కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, నామినేషన్లు స్వీకరిస్తారా? అప్పుడు ఎన్నికల వాయిదాపై కస్సుమన్న సర్కారు పెద్దలు.. ఇప్పుడు వాటి నిర్వహణకు సహకరిస్తారా? ఎన్నెన్నో ప్రశ్నలు! వస్తున్నాయి. మరోవైపు.. స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలే చేశారు.

ఏమీ చెయ్యలేరు..!

రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారు.. అది సరైన చర్య కాదు. నిమ్మగడ్డ మరో కొన్ని నెలల మాత్రమే ఉంటారు. తర్వాత రిటైర్డ్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. నిమ్మగడ్డ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను.. నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చెయ్యలేరు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అలా కాకుండా ఎన్నికల సంఘం నిర్వహిస్తానంటే జరిగే పనికాదు. కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం సాద్యం కాదు. ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కరోనా మహమ్మారి వల్ల ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి  లేదు. దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బీహర్ ఎన్నికలతో స్థానిక సంస్థలు పోల్చకూడదు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.


కాగా.. శనివారం నాడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో కుటుంబ సమేతంగా నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

స్థానికంపై సంకటం

Advertisement
Advertisement