Abn logo
Sep 27 2020 @ 00:51AM

మంత్రి ఈటలకు ఆశావర్కర్ల వినతి

Kaakateeya

మేడ్చల్‌: ఆశావర్కర్లు శనివారం టీఆర్‌ఎస్‌కేవి ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారిని ఏఎన్‌ఎం లుగా ప్రమోషన్‌ కల్పించాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఆశావర్కర్లను రిక్రూట్‌ చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పారితోషికం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు రామ్‌బాబుయాదవ్‌, ఆశా రాష్ట్ర నాయకురాలు సంతోషి, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌, పద్మ, మహాలక్ష్మీ, సుజాత, పుష్ప, ధనలక్ష్మీ, మాధవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement