Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమిక్రాన్ వేరియంట్ పై భయాలు వద్దు....అప్రమత్తత అవసరం

హైదరాబాద్: కరోనా వైరస్ ఒమైక్రాన్ వేరియంట్ పట్ల రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదని, సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆ వేరియంట్ ని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని, సామాజిక భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్’ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం సీఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడు కూడా అయిన మంత్రి మాట్లాడుతూ  ప్రభుత్వం - ప్రజలు కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు.


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్య వంటి శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.సీఎం కెసిఆర్ సూచనలతో మన రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యల్లో అప్రమత్తంగా ఉందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రజలు విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, శుభ్రత పాటించడం లాంటివి తప్పకుండా చేయాలన్నారు. ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ నిర్ణీత డోసులను పూర్తిగా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైద్యులు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే తగిన విధంగా వైద్యం అందించాలని ఆదేశించారు. గతంలో కరోనాను ఎదుర్కోవడంలో ఫ్రంట్ వారియర్స్ గా పని చేసిన అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థలు మరోసారి సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement