Abn logo
Oct 24 2020 @ 15:01PM

పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే వుంది- ఎర్రబెల్లి

Kaakateeya

హైదరాబాద్‌: ప్రపంచంలోనే ఆడబిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే ఉందని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం ఈ బతుకమ్మ పండగని అన్నారు. సద్దుల బతుకమ్మ, విజయ దశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవిత ద్వారానే బతుకమ్మ పండగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆడబిడ్డలకు పండగ కానుకగా బతుకమ్మ చీరలను ఇచ్చారన్నారు.


ఆడబిడ్డలను , అల్లుళ్లను ఇంటికి పిలిచి కానుకలు ఇవ్వడం ఈ పండగ ఆచార సంప్రదాయమన్నారు. బంధు మిత్రులతో ఆనందంగా జరుపుకునే పండగలు సద్దుల బతుకమ్మ, దసరా పండగలని మంత్రి పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా తప్పని సరిగా మాస్కులు ధరించి , భౌతిక దూరం పాటిస్తూ పండగలను జరుపుకోవాలని మంత్రి సూచించారు. 

Advertisement
Advertisement