Abn logo
Oct 11 2020 @ 05:47AM

ప్రపంచంలోనే బతుకమ్మ ప్రత్యేకం

Kaakateeya

అన్ని రంగాల్లో మహిళలను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్‌దే.. 

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి  


శామీర్‌పేట/మేడ్చల్‌/కీసర/ఘట్‌కేసర్‌ రూరల్‌/శామీర్‌పేట రూరల్‌/ కీసర రూరల్‌: బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైనదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం ఆయన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. శామీర్‌పేటలోని మ్యాక్‌ ఫంక్షన్‌హాల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి సర్పంచ్‌ బాలమణి ఆధ్వర్యంలో జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయి, జడ్పీటీసీ అనితలాలయ్యలతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మహిళలు సంప్రదాయంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గౌరవసూచికంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.


చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి ఇన్‌చార్జి ఎంపీడీవో శశిరేఖ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఎల్లు సుజాత, ఎంపీటీసీ సాయిబాబా, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, ఉపసర్పంచ్‌ రమేశ్‌, పంచాయతీ వార్డుసభ్యులు పాల్గొన్నారు. మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో  శనివారం ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌, వైస్‌ ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జెడ్పీటీసీ శైలజారెడ్డి, ఎండీఓ శశిరేఖ, తహసీల్దార్‌ గీత, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయానందరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌, మాజీ సర్పంచ్‌ ఎ.జగన్‌రెడ్డిలు పాల్గొన్నారు.


కీసరలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మంత్రి, జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిలు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 3 కోట్లకు పైగా, 250రకాల చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు మాధురి, మహేందర్‌రెడ్డి, ఆండాలు, సత్తమ్మ, గోపాల్‌రెడ్డి, కవిత, ఎంపీటీసీలు నారాయణ శర్మ, కవిత, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని ఎదులాబాద్‌ గ్రామపంచాయతీ అవరణలో మంత్రి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ సురేష్‌, ఉపసర్పంచ్‌ లింగేశ్వర్‌రావు, తహసీల్దార్‌ విజయలక్ష్మీ, ఇన్‌చార్జి ఎంపీడీవో పద్మలత, కార్యదర్శి నర్సింగ్‌రావు, ఎంపీటీసీలు సరళాకుమార్‌, రవి, వార్డుసభ్యులు మంజుల, నిర్మల, సురేష్‌, శ్రీనివాస్‌, ఆంజనేయులు, గడ్డిఅన్నారం మార్కెట్‌కమిటీ డైరెక్టర్‌ కొండల్‌రెడ్డి, కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుమార్‌, రవి, ప్రవీణ్‌రెడ్డి, నాగరాజు, సత్తయ్య, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.


శామీర్‌పేట పరిధి ఎంసీపల్లి మండల కేంద్రంలో మంత్రి  బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ హారిక, సర్పంచ్‌ రవి, ఎంపీడీవో సువిధ, సర్పంచ్‌ జ్యోతిబలరామ్‌ పాల్గొన్నారు. తూంకుంట పరిధిలోని సింగాయిపల్లి, హకింపేట ప్రాంతాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు వార్డు కౌన్సిలర్‌ సురేశ్‌తో కలసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు భిక్షపతి, కుమార్‌, రాజు, లక్ష్మణ్‌, భాను పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలో బతుకమ్మ చీరలను  మంత్రి ఆయా మున్సిపాలిటీల చైర్మన్లతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత, కమిషనర్లు వాణి, స్వామి, వైస్‌చైర్మన్లు మల్లే్‌షయాదవ్‌, నరేందర్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement