అమరావతి : ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలపై శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంగళవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ను ‘గుడ్డోడా కూర్చో..’ అని వెలంపల్లి వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో నిన్నటి నుంచి మంత్రి క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. మంగళవారం నాడు శాసనమండలిలో పంచాయతీరాజ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఇవాళ మళ్లీ వెల్లంపల్లి తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని రాజేంద్రప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు. వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుల పట్టుబట్టారు. ఇందుకు మండలి వేదికగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. రికార్డులు పరిశీలించాలని శాసన మండలి స్పీకర్ను కోరారు. ఈ క్రమంలో బొత్సతో టీడీపీ సభ్యుడు బుద్దా నాగజగదీశ్వర్రావు వాగ్వాదానికి దిగారు. దీంతో బుద్దా- బొత్సల మధ్య వ్యక్తిగత దూషణలు జరిగాయి. ఒకరిపైకి మరొకరు దూసుకొచ్చారు. పక్కనే ఉన్న వైసీపీ సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్.. మంత్రి బొత్సను అడ్డుకున్నారు. నిన్నటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
గుడ్డోడా కూర్చో..!