అమరావతి : పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వసామర్థ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడిన విషయం విదితమే. ఇదే విషయంపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుమారు గంటకు పైగా నిశితంగా చర్చ జరిగింది. ఇప్పటి వరకూ పోలవరం ఎత్తు, నీటి నిల్వసామర్థ్యంపై నెలకొన్న అనుమానాలకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించి అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు.
క్లారిటీ ఇచ్చేసిన మంత్రి..
‘పోలవరంపై అపోహలు కల్పించింది టీడీపీయే. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మిల్లీమీటర్ కూడా తగ్గించబోం. పోలవరం అంచనా వ్యయంలో బాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. టీడీపీ హయాంలో ఏనాడు పోలవరాన్ని పట్టించుకోలేదు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. పోలవరం ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తాం. పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్ కూడా తగ్గించే ప్రసక్తే లేదు’ అని అసెంబ్లీ వేదికగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు.
కావాలనే వివాదం..
ఇందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘పోలవరంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ తీరు వల్లే అనుమానాలు కలుగుతున్నాయి. పోలవరంపై టెండర్లను నా హయాంలో పిలవలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు మొదలయ్యాయి. 2013 ముగిసే నాటికి టెండర్లు ఇచ్చారు, టెండర్లను మేం పిలవలేదు. 7 ముంపు మండలాలు తీసుకురాకపోయి ఉంటే ప్రాజెక్టు ఉండేది కాదు. పోలవరం టెండర్లను వైఎస్ ప్రీక్లోజర్ చేశారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చే వరకు ఫైనల్ చేయలేదు. పోలవరాన్ని కావాలని వివాదంలోకి నెడుతున్నారు. మీరు తవ్విన గోతిలో మీరే పడే పరిస్థితి వచ్చింది’ అని జగన్ సర్కార్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
పోలవరం ఎత్తు తగ్గదు!చంద్రబాబు ఒప్పుకున్నారు.. : అసెంబ్లీలో మంత్రి అనిల్