Abn logo
May 24 2020 @ 03:53AM

ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడండి

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌


 నెల్లూరు (జడ్పీ ) మే 23: లాక్‌డౌన్‌ సడలింపుతో నగరంలో రవాణా వ్యవస్థ ప్రారంభమైనందున ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి  హరనాథపురం, ముత్తుకూరు రోడ్డు, ఆత్మకూరు బస్టాండ్‌, స్టౌన్‌హౌ్‌సపేట, విజయమహల్‌ గేటు ప్రాంతాల్లో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణపట్నం రోడ్డులో ఉన్న టిఫిన్‌ అంగళ్లు, పండ్లు, కూరగాయల వ్యాపారం చేసుకునే వారందరికీ కార్పొరేషన్‌ తరఫున అంగళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్‌కు, పార్కింగులకు ఇబ్బందులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. 150నుంచి 200దుకాణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రూరల్‌ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి, రూప్‌కుమార్‌ యాదవ్‌,  నాయకులు సన్నపురెడ్డి పెంచల్‌ రెడ్డి, ముక్కాల ధ్వారకానాథ్‌, పెంచల్‌ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement