Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయినా అభివృద్ధి ఆగలేదు... మంత్రి సురేష్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా వంటి విపత్తులు వచ్చినా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. జగన్ ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. రాజకీయాల్లో దౌర్జన్యాలు చేయడం టీడీపీ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. సీఎం గాల్లో కలిసిపోతారనే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. మూడు పార్టీలు కుమ్మక్కై దాడి చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రకృతి విపత్తు వస్తే ప్రభుత్వ తప్పిదం అంటున్నారన్నారు. 


Advertisement
Advertisement