Abn logo
Dec 5 2020 @ 01:32AM

బోడసకుర్రు రీచ్‌లో మైన్స్‌శాఖ దాడులు

అల్లవరం, డిసెంబరు 4: బోడసకుర్రు రీచ్‌లో మైనింగ్‌ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఇసుక లోడింగ్‌ యంత్రాలతో వద్దని, మనుషులతో చేపట్టాలని అధికారులు సూచించారు. మైన్స్‌శాఖ, ఇరి గేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన  దాడుల్లో మైన్స్‌ అధికారులు,  ఎస్‌ఐ బి.ప్రభాకరరావు, వీఆర్వో చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీవెంకటేశ్వరా బోట్స్‌మెన్‌ అండ్‌ ఫిషర్‌మెన్‌ సొసైటీ ద్వారా జరుగుతున్న ఇసుకతీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.


Advertisement
Advertisement
Advertisement