కర్నూలు: తన సమావేశానికి సీఎం జగన్ అనుమతి ఇవ్వలేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బెకార్ అని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. జగన్ మైనార్టీలను ఓటు రూపంలో వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్‌రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.