Abn logo
Apr 6 2020 @ 05:39AM

వలస కూలీల ఆకలి కేకలు

లాక్‌డౌన్‌తో నిలిచిన పనులు  

పనిలేక పస్తులుంటున్న కూలీలు 

ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న కుటుంబాలు

ఖాళీగా కనిపిస్తున్న లేబర్‌ అడ్డాలు  

దాతల సాయం కోసం ఎదురు చూపులు  

జిల్లాలో ‘నా వంతు’ కార్యక్రమానికి విశేష స్పందన


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా మ హమ్మారి దెబ్బతో దినసరి కూలీలు విలవిలలాడుతు న్నారు. పక్షం రోజులుగా పనులు లేక దినదిన గండం గా గడుపుతున్నారు. కొందరు పని చేసేందుకు ముం దుకువస్తున్నా పని దొరకడమే గగనమవుతోంది. జిల్లా కేంద్రంలోని నేతాజీచౌక్‌, రైల్వేస్టేషన్‌, కలెక్టర్‌చౌక్‌ నిత్యం దినసరి కూలీలతో రద్దీగా ఉండేవి. కానీ ప్రస్తు తం లాక్‌డౌన్‌ ఆంక్షలతో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. పల్లెల్లో కూడా ఎవరు ఇంటి నుంచి బయటకు రాక పోవడంతో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పరిస్థితులు మారిపోతున్నాయి. జిల్లా లో 6612 మంది వలస కూలీలను గుర్తించిన అధికా రులు వారికి ఉచితంగా 12 కిలోల బియ్యం, రూ.500 నగదును అందజేశారు. అయినా అవి ఏ మూలన సరిపోవడం లేదంటున్నారు.


గ్రామాల్లో ఉపాధి పనులు కూడా నిలిచిపోవడంతో కూలీలంతా ఇంటికే పరిమితమవుతున్నారు. జిల్లాలో బీడీ కంపెనీలు కూడా మూతబడి పోవడంతో బీడీ కార్మికులకు కూలీ కరువవుతోంది. దీంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారుతోంది. ముఖ్యంగా రెక్కాడితే కాని డొక్కనిండని దినసరి కూలీల పరిస్థితి మరీ దయనీ యంగా మారుతోంది. కుటుంబ యజమాని పని చేస్తేనే కుటుంబమంతా కడుపు నింపుకునే పరి స్థితులు ఉన్నాయి. కొందరికి సొంత ఇళ్లు కూడా లేదు. ఇలాంటి వారంతా అద్దె ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కానీ లాక్‌డౌన్‌తో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.


వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు..

దినసరి కూలీల కుటుంబాలను వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజుల తరబడి పని లేక పోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్నాళ్లు పరి స్థితులు ఇలాగే ఉంటే ఆరోగ్యం మరింత క్షీణించే అవ కాశం ఉందని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. 


ఖాళీగా మారిన లేబర్‌ అడ్డాలు..

లాక్‌డౌన్‌తో గృహనిర్మాణ రంగం, ఇతర వ్యాపారాలు పూర్తిగా నిలిచి పోవడంతో జిల్లాలో ఉన్న లేబర్‌ అడ్డాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న నేతాజిచౌక్‌, పలు అడ్డాలతో పాటు ఇచ్చోడ మండల కేంద్రం, ఉట్నూర్‌ మండలాల్లో లేబర్‌ అడ్డాలలో ఎవరు కనిపించడం లేదు. కొందరు పని చేసేందుకు ముందుకు వస్తున్నా పిలిచే వారే కరువవుతున్నారు. దీంతో ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.


దాతల కోసం ఎదురు చూపులు..

బయటకు వెళ్లే పరిస్థితి లేక పోవడంతో ఇన్నాళ్లు ఇంట్లో ఉన్న సరుకులతోనే కాలం గడిపారు. అది కూడా పూర్తిగా ఖాళీ కావడంతో చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చి  బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించడంతో కొంత ఊరట కలిగింది. అలాగే కలెక్టర్‌ నావంతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో జిల్లాలో విశేష స్పందన వస్తోంది. కొందరు దాతలు కదిలి స్వచ్ఛం దంగా నిరుపేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక పేద కుటుంబాలు అయోమ యానికి గురవుతున్నాయి.

Advertisement
Advertisement