Abn logo
Jul 10 2020 @ 21:12PM

మెక్సికోలో కొనసాగుతున్న కరోనా విలయం..!

మెక్సికో సిటీ: ప్రపంచ దేశాలపై కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. మెక్సికోలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గురువారం ఒక్కరోజే మెక్సికోలో 7,280 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు నిన్న 730 మంది బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు మెక్సికోలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2.82లక్షలకు చేరింది. 33వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మెక్సికో 9వ స్థానంలో ఉంది. అయితే మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మాత్రం మెక్సికో 5వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1.24కోట్లుకు చేరింది. 5.58లక్షల మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. 


Advertisement
Advertisement
Advertisement