Abn logo
Aug 7 2020 @ 03:56AM

నిరాశపర్చిన అల్పపీడనం

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది శుక్రవారానికి పూర్తిగా బలహీన పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, కోస్తాలో గురువారం చిరుజల్లులు మాత్రమే కురవడంతో రైతులు నిరాశ చెందారు. కాగా, ఈనెల 9నపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నందున కోస్తాలో వర్షాలు పెరుగుతాయని అంచనా వేసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 8న ఉత్తరాంధ్ర, యానాంలలో, 9న రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, 10న ఉత్తరాంధ్రలో అతిభారీ వర్షం కురుస్తాయని ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement