Abn logo
Jul 7 2020 @ 06:40AM

మేరే సాయి టీమ్ స‌భ్యునికి క‌రోనా పాజిటివ్‌... షూటింగ్ నిలిపివేత‌!

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమ‌వ‌డంతో అనేక టీవీ ప్రాజెక్టుల షూటింగ్‌లు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌ధ్యంలోనే టీవీ సీరియల్ మేరే సాయి చిక్కుల్లో ప‌డింది. ఈ సీరియల్‌లోని ఒక న‌టునికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సుమారు 100 రోజుల తరువాత చిత్రీకరణ మొద‌లైన ఈ సీరియ‌ల్ షూటింగ్ నిలిపివేశారు. అలాగే సీరియ‌ల్ యూనిట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ సీరియ‌ల్‌ నటుడు తుషార్ దల్వి మీడియాతో మాట్లాడుతూ మా స‌భ్యుల‌లోని ఒక‌రికి క‌రోనా సోక‌డం త‌న‌ను ఆశ్చర్యపరిచింద‌ని, దీంతో షూటింగ్ వాయిదా ప‌డింద‌న్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రతి ఒక్క‌రూ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డి, వీలైనంత త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement