Abn logo
Oct 13 2020 @ 00:00AM

గర్భిణుల మానసిక ఆరోగ్యం!

కరోనా కాలంలో గర్భిణిలు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.  బిడ్డ గురించి గర్భవతులు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇందుకోసం....

  1. భయాందోళనలకు, ఒత్తిడికి లోను చేసే కరోనా వార్తలు చదవడం, చూడడం, వినడం చేయకూడదు.
  2. కరోనా కాలంలో ఈ వైరస్‌ గురించి భయాందోళన ఎంతో కొంత ఉండడం సహజం. అంతమాత్రాన మీకూ సోకుతుందేమో అనే భయంతో నిరంతరం ఆందోళనలోనే గడపడం వల్ల, ఆ ప్రభావం బిడ్డ ఎదుగుదలపై పడుతుంది. 
  3. మనసును తేలికపరిచే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం చేయాలి. వీలైతే ఆశాజనక కథనాలు చదవాలి. ఉదాహరణకు... కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు, అడ్డంకులను అధిగమించి పిల్లలను కన్న తల్లుల కథనాలు చదవాలి.
  4. మానసిక ఒత్తిడిని తొలగించే తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు వైద్యులు, శిక్షకుల సూచన మేరకు చేయాలి.

Advertisement
Advertisement