Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరివెన్నెల జ్ఞాపకాలు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు)/చిత్తూరు (కల్చరల్‌): నవంబరు 30: సినిమా పాటలకు గౌరవాన్ని పెంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రికి మన జిల్లాతోనూ అనుబంఽధముంది.వేంకటేశ్వర స్వామి భక్తుడిగా అనేకమార్లు సీతారామశాస్త్రి కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు.కాణిపాక వరసిద్ధి ఆలయానికి కూడా పలు మార్లు కుటుంబ సమేతంగా దైవదర్శనానికి వచ్చారు.2005వ సంవత్సరంలో తిరుపతిలో నిర్వహించిన తెలుగు సంస్కృతీ వారోత్సవాల్లో సిరివెన్నెల పాల్గొన్నారు.మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ సభలో సినీ గేయ సాహిత్యంపై మాట్లాడిన సీతారామశాస్త్రిని కార్యక్రమ నిర్వాహకులైన అప్పటి తుడా చైర్మన్‌, ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఘనంగా సన్మానించారు.2002వ సంవత్సరంలో చిత్తూరులో కల్చరల్‌ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో సిరివెన్నెల జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.చిత్తూరులోని లిటిల్‌ ఫ్లవర్‌ కాన్వెంట్‌లో నిర్వహించిన ఈ సభలో నాటి తమిళనాడు గవర్నర్‌ పీసీ రామ్మోహనరావు, ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కలెక్టర్‌ సాయిప్రసాద్‌,సినీ నటులు మోహన్‌బాబు, కైకాల సత్యనారాయణ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, నిర్మాత ఎంఎస్‌ రెడ్డి తదితర ప్రముఖులతో పాటు అకాడమీ వ్యవస్థాపకుడు,ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాజశేఖర నాయుడు పాల్గొన్నారు.మదనపల్లెలో భరతముని అవార్డ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సమ్మేళనంలోనూ ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. 

Advertisement
Advertisement