Abn logo
Sep 25 2021 @ 12:27PM

నాడు ఐపీఎస్.. నేడు ఐఏఎస్...

            - మేఘస్వరూప్‌కు 31వ ర్యాంకు 


కర్నూలు: జిల్లాకు చెందిన మేఘస్వరూప్‌ సివిల్స్‌-2020లో 31వ ర్యాంకు సాధించారు. గత సంవత్సరం 98వ ర్యాంకు సాధించిన ఆయన ఐపీఎస్‌కు సెలెక్ట్‌ అయి ప్రస్తుతం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ(హైదరాబాద్‌)లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతూనే ఐఏఎస్‌ లక్ష్యంగా యూపీఎస్‌సీ పరీక్ష రాసి అనుకున్నది సాధించారు. మేఘ స్వరూప్‌ తండ్రి చంద్రశేఖర్‌ పంజాబ్‌ పవర్‌ గ్రిడ్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తుండగా.. తాత రామలింగారెడ్డి స్థానిక కృష్ణానగర్‌ మున్సిపల్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు.