Abn logo
Aug 3 2020 @ 23:53PM

బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి మెగాస్టార్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా?

ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం వారికి అందుబాటులో ఉన్న విధంగా సంబరాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమానుల కోసం తన పుట్టినరోజున ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. ఈసారి కూడా అభిమానులకు చక్కని ట్రీట్ ఇచ్చేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నట్లుగా మెగావర్గాల నుంచి తెలుస్తుంది.


ఈ పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారట. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న చిరు.. తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిటైల్స్‌ను చెప్పి, అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. అయితే మెగాస్టార్ తదుపరి చిత్ర విషయమై.. ఇప్పటి వరకు లూసిఫర్ రీమేక్ అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రాన్ని చిరు క్యాన్సిల్ చేసుకున్నట్లుగా టాక్. అలాగే మెహర్ రమేష్‌తో మూవీని కూడా చిరు రద్దు చేసుకున్నాడని అంటున్నారు. ఇక చిరు చెప్పిన డైరెక్టర్స్‌లో మిగిలింది బాబీనే. చిరుకి ఇటీవల బాబీ ఓ స్టోరీ వినిపించాడని, చిరు కూడా చాలా ఎంజాయ్ చేశారనే టాక్ నడిచింది కాబట్టి.. చిరు తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలోనే అనే వార్తలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆగస్ట్ 22న చిరు తన అభిమానులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారో చూద్దాం.

Advertisement
Advertisement
Advertisement