Abn logo
Mar 25 2020 @ 18:02PM

అమ్మ‌తో మెగానుబంధం

కుటుంబంలో కూతుళ్ల‌కు తండ్రంటే ఎక్కువ ప్రేమ‌, కొడుకుల‌కు అమ్మంటే ఎక్కువ ప్రేమ. అరుదైన సంద‌ర్భాల్లో త‌ప్ప అంద‌రూ ఇది ఒప్పుకోవాల్సిన నిజం. మెగా ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే కొన్నాళ్ల క్రితం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌..రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి త‌మ అమ్మ‌ల‌తో ఉండే అనుబంధాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. అదేంట‌ని చూస్తే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్  సోష‌ల్ మీడియాలో భాగ‌మైన ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు త‌ల్లి సురేఖ‌తో ఉన్న ఫొటోను తొలి ఇన్‌స్టా మెసేజ్‌గా షేర్ చేసుకున్నారు. అలాగే ఈ ఉగాదికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ల్లి అంజ‌నా దేవీతో ఉన్న ఫొటోను తొలి మెసేజ్‌గా షేర్ చేసుకున్నారు. ఇలా ఇద్ద‌రు మెగా హీరోలు అమ్మ‌తో త‌న‌కున్న అనుబంధాన్ని తెలియ‌జేశారు. 

Advertisement
Advertisement
Advertisement