Abn logo
Sep 29 2020 @ 01:30AM

మేడ్చల్‌ జిల్లాను గ్రీనరీగా మార్చాలి

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు


మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాను గ్రీనరీగా మార్చాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి , జెడ్పీటీసీ శైలజారెడ్డి,  ఎండీఓ శశిరేఖ, సర్పంచ్‌ లక్ష్మీ సంజీవ, తహసీల్దార్‌ గీత, నాయకులు మహేష్‌, పాషా పాల్గొన్నారు. 


స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్‌ 

శామీర్‌పేట రూరల్‌: పల్లె ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని, స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ సూచించారు. సోమవారం ఎంసీపల్లి మండలం కొల్తూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతివనంలో అన్ని రకాల మొక్కలు నాటి చుట్టూ పెన్సింగ్‌ వేయాలని అన్నారు. వైకుంఠధామం రెండెకరాల విస్తీర్ణంలో ఉన్నందును చుట్టు కంచె ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో ఎన్ని మొక్కలు నాటారని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటివరకు 30వేల మొక్కలు నాటామని చెప్పారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో స్మిత, ఎంపీవో రవి, సర్పంచ్‌ భర్త యాదగిరి, కార్యదర్శి స్వప్నప్రియ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement