Abn logo
Sep 18 2021 @ 01:34AM

కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు

పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలను పరిశీలిస్తున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

చిత్తూరు, సెప్టెంబరు 17: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం చిత్తూరు పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలోని స్ర్టాంగ్‌ రూమ్‌ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌ యాక్టు 30 అమలులో ఉన్నందున కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, అనుచరులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ఓటమి చెందిన అభ్యర్థులపై, ఆయా పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే డయల్‌ 100 లేదా పోలీస్‌ వాట్సాప్‌ నెంబరు 9440900005కు సమాచారం ఇవ్వాలని కోరారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.