Jun 23 2021 @ 15:00PM

మోకాలిపై టాటూ... అర్థం చెప్పిన సాక్షి అగ‌ర్వాల్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్‌ యువ కథానాయిక సాక్షి అగర్వాల్‌.  ఈ భామ మరో స్టార్‌ హీరో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొని అనేక మంది ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె నటించిన ‘సిండ్రెల్లా, పురవి, అరణ్ మణై 3’ తదితర చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదేసమయంలో సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా వుండే ఈమె... లాక్‌డౌన్‌ సమయంలో అందాలను ఒలకబోస్తు ప్రత్యేక ఫొటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫొటోల్లో గ్లామర్‌ మోతాదు ఎక్కువైందనే కామెంట్స్‌ వినొస్తున్నాయి కూడా.  ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఎడమ కాలి తొడపై ఫ్రెంచ్‌ భాషలో ఓ టాటూ వేయించుకుంది. కానీ, అది ఫ్రెంచ్‌ భాషలో ఉండటంతో ఫ్యాన్స్‌కు అర్థంకాలేదు. దీంతో దానర్ధం చెప్పాలంటూ పలు వురు  ఆమెను కోరడంతో..  లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనే అర్థం అని ఆమె  ఆమె సమాధానమిచ్చింది.