Abn logo
Jul 10 2020 @ 04:28AM

ఆరు నెలల్లో టిడ్కో ఇళ్ల కేటాయింపు

 ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ 


గాజువాక, జూలై 9: అర్హులైన దరఖాస్తుదారులకు ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లను కేటాయించనున్నట్లు ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను సత్వరం పూర్తిచేస్తామని చెప్పారు. గాజువాక నియోజకవర్గం పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం జోనల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముగింపు దశలో ఉన్న ఇళ్లను వీలైనంత వేగంగా పూర్తిచేసి వాటా ధనాన్ని చెల్లించిన వారిలో అర్హులకు అందజేస్తామన్నారు.


లబ్ధిదారుల డిమాండ్‌ను బట్టి ఇళ్ల నిర్మాణాలను కొనసాగిస్తామని, డిమాండ్‌ అంతగా లేనిచోట ప్రారంభ దశలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇళ్లకు అధిక డిమాండ్‌ ఉన్నందున వీలైన ఎక్కువ ఇళ్లు నిర్మించాలని ఎండీని కోరారు. దరఖాస్తుదారుల్లో అనర్హులని తేల్చిన వారి దరఖాస్తులను మరోసారి పరిశీలించి అర్హత ఉంటే అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో జెడ్సీ శ్రీధర్‌, యూసీడీ పీడీ వై.శ్రీనివాసరావు, టిడ్కో అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement