Abn logo
Oct 14 2021 @ 00:37AM

అంజుమన్‌ పన్ను బకాయిలను రద్దు చేయాలి

మేయర్‌ కావటి మనోహర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కర్నుమా తదితరులు

మేయర్‌ కావటికి విజ్ఞప్తి

గుంటూరు, కార్పొరేషన, అక్టోబరు 13: అంజుమన్‌ సంస్థల మున్సిపల్‌ పన్నుల బకాయిలను రద్దు చేయాలని అంజుమన్‌ ఈ ఇస్లామియా సంస్థ అద్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ కర్నుమా, కార్యదర్శి సయ్యద్‌ అబ్దుల్‌ సలాం, హిదాయతుల్లాలు నగర మేయర్‌ కావటి శివనాగమనోహర్‌నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కర్నుమా మాట్లాడుతూ అంజుమన్‌ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంతో అంజుమన్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నట్లు తెలిపారు. మేయర్‌ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామన్నారు.