Abn logo
Sep 27 2020 @ 20:20PM

చెలరేగుతున్న మయాంక్.. ఫుల్ జోష్‌లో రాహుల్

Kaakateeya

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చెలరేగిపోతోంది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలుపెట్టారు. క్రీజులో కుదురుకున్నాక మయాంక్ అగర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.


26 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ జోరు కొనసాగిస్తుండగా, మరోవైపు రాహుల్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝళిపిస్తున్నాడు. వీరిద్దరి దెబ్బకు 9 ఓవర్లు కూడా పూర్తికాకముందే జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది. రాహుల్ 36, మయాంక్ 69 పరుగులుతో క్రీజులో ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement