Abn logo
Sep 26 2020 @ 05:14AM

మాతా శిశు మరణాలు జరగకుండా చూడాలి

గద్వాలక్రైం, సెప్టెంబరు 25: మాతా శిశు మ రణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఆశా, ఆరోగ్య కార్యకర్తపై ఉన్నదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ చందూనాయక్‌ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మాతా శిశు మరణాలు, జాతీ య నులిపురుగుల నిర్మూలనపై ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది, ఎంసీహెచ్‌ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు మరణాలు సంభవిస్తే అందుకు గల కారణాలు విశ్లేషించి దానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుం టామన్నారు. మాతా శిశు మరణాలు తగ్గాలంటే ప్రతి ఆరోగ్య కార్యకర్త, ఆశలు ప్రతి గర్భిణిని మొదటి త్రైమాసికంలోనే తప్పనిసరిగా రిజిస్ర్టేష న్‌ చేసి, హైరిస్క్‌ను సేవలు అందిస్తే మరణాలు సంభవించవన్నారు.


జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం వచ్చే నెల 5 నుంచి 12 వరకు జరుగుతుందని, ఆ రోజుల్లో ప్రతి ఆరోగ్య కార్యకర్త, ఆశాలు, అంగన్‌వాడీ టీచర్‌ ఇంటింటికి వెళ్లి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 1-19 సంవత్సరాల పిల్లలకు ఆల్‌బెండజోల్‌ మా త్రలు డోస్‌ల వారిగా ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డా.సునీత, డాక్టర్లు సౌజన్య, శశికళ, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, డీడీఎం రామాంజనేయులు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement